ఫ్రెండ్ కోసం ప్రభాస్ వస్తున్నాడా? క్లారిటీ ఇదే!

Published on Sep 1, 2021 2:50 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ మరియు సలార్ అనే రెండు కంప్లీట్ డిఫరెంట్ జానర్ సినిమాలు ఏక కాలంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ రెండు సినిమాలకి శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేస్తున్న ప్రభాస్ పై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తుంది.

ప్రభాస్ కి క్లోజ్ ఫ్రెండ్ మరియు టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ నటించిన “సీటీమార్” ప్రీ రిలీజ్ కోసం ప్రభాస్ వస్తున్నాడని ఒక రేంజ్ లో హంగామా నడుస్తుంది. కానీ ఇందులో అసలు విషయం ఏమిటంటే ప్రభాస్ వస్తున్నాడు లేదు అన్నది ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ షూట్ లో బిజీగా ఉన్నాడు అంతే కానీ ఇంకా ఏది ఫిక్స్ కాలేదు.

సో ప్రస్తుతం స్ప్రెడ్ అవుతున్న న్యూస్ లో ఎలాంటి నిజం లేదు అందుకే అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. అయితే ఇది వరకే ప్రభాస్ గోపీచంద్ కోసం ‘జిల్’ ఫంక్షన్ కోసం వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే చాలా మంది ఈ ఫంక్షన్ కి కూడా వస్తాడని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతానికి అయితే సీటీమార్ ట్రైలర్ మాత్రం భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. సంపత్ నంది తెరకెక్కించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా వచ్చే 10వ తారీఖున ఈ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :