ప్రభాస్ ఇక మళ్ళీ రెడీ అవుతున్నాడా.?

Published on Jun 3, 2021 11:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలు కూడానూ ఒకే చోటకు చేరాయి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన భారీ ఇతిహాస గాథ చిత్రం “ఆదిపురుష్”, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థిల్లర్ చిత్రం “సలార్” సహా “రాధే శ్యామ్” కాస్త బ్యాలన్స్ షూట్ కూడా ఇక్కడికే వచ్చి చేరింది.

కానీ కరోనా రెండో వేవ్ వలన అవి అన్ని కూడా మళ్లీ వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ ఈ మూడు చిత్రాల షూట్ కి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణాలో తగ్గుముఖం పడుతున్న కరోనా ప్రభావం మరియు తాజాగా ఇచ్చిన సడలింపులతో మేకర్స్ ఈ షూట్స్ స్టార్ట్ చెయ్యడానికి రంగం సిద్ధం చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ప్రభాస్ ఎప్పుడు నుంచి మళ్ళీ రీస్టార్ట్ చెయ్యనున్నాడో చూడాలి.

సంబంధిత సమాచారం :