సాహో లో ప్రభాస్ నెగెటివ్ షేడ్స్ తో…?

Published on Aug 24, 2019 12:34 am IST

సాహో ఈ నెల 30న నాలుగు ప్రధాన భాషలలో భారీ విడుదల కానుంది. కన్నడ భాషలో కూడా సాహో విడుదల నేపథ్యంలో నేడు ప్రభాస్ బెంగుళూరులో పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగే పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కాగా వారిలో ఒకరు మీరు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తారా అన్న ప్రశ్నకు అనాలోచితంగా సాహో లో తన పాత్ర కొంచెం అలాగే ఉంటుందన్న ట్విస్ట్ ని బయటపెట్టడం జరిగింది.

దీనితో సాహో చిత్రంలో ప్రభాస్ పాత్ర కొంచెం నెగెటివ్ లక్షణాలు కలిగివుంటుందనే విషయాన్నీ ఆయన చెప్పకనే చెప్పారు. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మురళి శర్మ, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రలు చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :