లేటెస్ట్..ప్రభాస్ మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వారితోనేనా.?

Published on Jul 13, 2021 8:14 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఎలాంటి పాపులారిటీ సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్ తో ఓ సినిమా అనుకుంటే దానికి నో డౌట్ గా ప్రభాస్ పేరే వినిపిస్తుంది. ఇప్పుడు అలా ఒకదాన్ని మించిన ఒకటి భారీ చిత్రాలను చేస్తూ వెళ్తున్న ప్రభాస్ లైనప్ లో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కూడా ఉందని టాక్ ఉంది.

అదే బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సిద్దార్థ్ ఆనంద్ తో.. ఈ సెన్సేషనల్ కాంబోపై ఎప్పటి నుంచో బజ్ ఉంది. అయితే ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నే నిర్మాణం వహించనున్నారని టాక్ బలపడింది. ఎందుకంటే తాజాగా సిద్ధార్థ్ ను డైరెక్టర్ గా తమ బ్యానర్ లో ఓ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ సినిమా ప్రభాస్ తోనే అని వినికిడి. మరి ఈ సాలిడ్ కాంబోపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :