“పుష్ప” పార్ట్ 1 అప్పటికే ఫిక్సా..?

Published on Jun 26, 2021 7:02 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చివరి దశ షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల ఎప్పుడు అన్న దానిపై ఎప్పుడు నుంచో బజ్ వినిపిస్తుంది.

అయితే కరోనా ప్యాండమిక్ మూలాన ఈ చిత్రం డిసెంబర్ కి వాయిదా పడింది అని అప్పుడు గాసిప్స్ వినిపించాయి. అలాగే తర్వాత మళ్ళీ అక్టోబర్ కి రావచ్చేమో అని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇదే అక్టోబర్ రేస్ లో మరిన్ని సినిమాలు ఆల్రెడీ డేట్స్ లాక్ చేస్తుండడంతో పుష్ప పార్ట్ 1 డిసెంబర్ రిలీజ్ నే అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. బహుశా షూట్ మొత్తం కంప్లీట్ అయ్యాక అనౌన్స్మెంట్ రావొచ్చు.

సంబంధిత సమాచారం :