పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్సిడ్ రెస్పాన్స్ దక్కింది. అయితే, అభిమానులు ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది ఈ సినిమా. దీంతో ఈ మూవీ ఫలితంతో ప్రభాస్ సినిమాలపై కొన్ని వింత అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ కెరీర్‌లో రాఘవేంద్ర, రెబల్, రాధే శ్యామ్, ఇప్పుడు ది రాజా సాబ్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడాన్ని చూపిస్తూ, ‘R’ అక్షరం ఆయనకు కలిసిరావడం లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ తరహా విశ్లేషణలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన గతంలో నటించిన ‘R’ అక్షరంతో మొదలయ్యే సినిమాలు నిజంగానే ఫెయిలూర్స్‌గా మిగిలాయి.
ఇప్పుడు రాజా సాబ్ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే సినీ విశ్లేషకులు మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు. సినిమా విజయం లేదా పరాజయం అన్నది టైటిల్ అక్షరాలపై కాకుండా, బలమైన కథ, సరైన కథనం, మేకింగ్‌పై ఆధారపడి ఉంటుందని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా, ‘ది రాజా సాబ్’ ఫలితం ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.


