రాజమౌళితో ప్రభాస్ మరోసారి..ఎంతవరకు నిజం.?

Published on May 30, 2021 6:30 pm IST

దర్శక ధీరుడు రాజమౌళి మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు “బాహుబలి” చిత్రంతో ఇండియన్ సినిమా రూపు రేఖలు మార్చేశారు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరి పేర్లు కూడా బ్రాండ్స్ గా మారిపోయాయి. అయితే ఈ చిత్రం అనంతరం వీరు టేకప్ చేస్తున్న ఒక్కో సినిమా కూడా ఇండివిడ్యుయల్ గా భారీ అంచనాలు నెలకొల్పుకుంటున్నాయి.
మరి బాహుబలి రెండు చిత్రాల అనంతరం మళ్ళీ ఈ కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందో అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

కానీ లేటెస్ట్ గా ఈ కాంబోలో సినిమా ఉందని ఓ రూమర్ వైరల్ అవుతుంది. అది కూడా రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో ప్లాన్ చేసిన పాన్ ఇండియన్ సినిమా తర్వాత ఉంటుందని టాక్ మొదలయింది. అయితే ప్రస్తుతానికి ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజమూ లేదన్నట్టు తెలుస్తుంది. మరి ఇది జస్ట్ టాక్ మాత్రమేనా లేక నిజమా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :