సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇండో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ వరల్డ్ చిత్రమే “వారణాసి”. ఇండియన్ సినిమా నుంచి రెండో పూర్తి ఐమ్యాక్స్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకి జక్కన్న పాత స్ట్రాటజీ పక్కన పెట్టేసి హాలీవుడ్ స్ట్రాటజీలో వెళ్లిపోతున్నారా అని చెప్పొచ్చు.
ఇది వరకు మన సినిమాలకి ఓ పోస్టర్ వదలాలంటే దానికొక అప్డేట్ మళ్ళీ దాని టైం కి ఒక అప్డేట్ ఇలా అప్డేట్ కే అప్డేట్ ఇస్తూ నాన్చేవారు. కానీ ఇపుడు సర్ప్రైజింగ్ గా ఎలాంటి హంగామా లేకుండా హాలీవుడ్ సినిమాల స్టైల్ లో సినిమా నుంచి సరికొత్త స్టిల్స్ ని సడెన్ గా వదిలారు. దీనితో ఆ పాత స్ట్రాటజీ పక్కన పెట్టారా అనే అనుకోవాలి. ఇక ముందు ట్రైలర్, టీజర్ లకి మాత్రం మామూలుగానే టైం, డేట్స్ రావచ్చు. కానీ స్టిల్స్ ని మాత్రం ఇలా వదలడం పాత స్ట్రాటజికి చెక్ పెట్టినట్టే అనుకోవాలి.


