“RRR”లో రాజమౌళి వారిలానే అజయ్ రోల్ కూడా డిజైన్ చేసారా.?

“RRR”లో రాజమౌళి వారిలానే అజయ్ రోల్ కూడా డిజైన్ చేసారా.?

Published on Apr 24, 2021 6:25 PM IST

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు పవర్ మాస్ హీరోస్ తో ఇది వరకు ఎన్నడూ రాని మల్టీ స్టారర్ ను ప్లాన్ చేసారు అదే “రౌద్రం రణం రుధిరం”. భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ బిగ్గెస్ట్ పీరియాడిక్ మల్టీ స్టారర్ ను జక్కన్న ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. అయితే రాజమౌళి తన ప్రతీ సినిమాలో కూడా కొన్ని పాత్రలను ఎంత పవర్ ఫుల్ గా ప్రొజెక్ట్ చేస్తారో మనం చూసాం. చరిత్రలో పురాణం, ప్రకృతి శక్తులను వాటికి ప్రతీకలు లాంటి వాటితో తెరపై రాజమౌళి చూపిస్తారు.

మరి అలాగే లేటెస్ట్ RRR లో చరణ్ చేస్తున్న అల్లూరి పాత్రను అగ్ని లా తారక్ చేస్తున్న కొమరం భీం పాత్రను నీటికి ప్రతీకగా చూపిస్తూ వస్తున్నారు. అయితే పంచభూతాల్లో అతి శక్తివంతమైన మూలల్లో ఈ రెండు కూడా ఒకటి. మరి వీరికి వాటిని ప్రతీకగా చూపించినట్టే ఈ చిత్రంలో మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవ్ గన్ రోల్ ను కూడా చూపిస్తున్నారని చెప్పొచ్చు.

ఎందుకంటే మొదటి నుంచీ తారక్ మరియు చరణ్ రోల్స్ పై పోస్టర్స్ కానీ టీజర్స్ కానీ బ్లూయిష్ మరియు రెడిష్ గా చూపిస్తున్నారో అలాగే అజయ్ దేవ్ గన్ టీజర్ ను చూస్తే సృష్టిలో మరో పవర్ ఫుల్ ఎలిమెంట్ నేల కు ప్రతీకగా చూపినట్టు అనిపిస్తుంది. అలాగే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అజయ్ పై డిజైన్ చేసిన టీజర్ లో కూడా ఫస్ట్ షాట్ భూమిపై నిలబడి ఉన్న సీన్ నే చూపిస్తారు.

అక్కడ నుంచి మిగతా షాట్స్ అన్నీ కూడా ఆ రిలేటెడ్ గానే అనిపిస్తాయి. మరి బహుశా తారక్ మరియు చరణ్ పాత్రలు ఎలా అయితే ప్లాన్ చేసారో అజయ్ దేవ్ గన్ రోల్ ను కూడా చేసినట్టు ఆలోచన రాక మానదు. మరి నిజంగానే రాజమౌళి అలా డిజైన్ చేసారా అన్నది ఆయనకే తెలియాలి. ప్రస్తుతానికి అయితే చిత్ర యూనిట్ కోవిడ్ బ్రేక్ తీసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు