ఓటిటి ల పై దృష్టి సారించిన స్టార్ హీరోయిన్!?

Published on Jul 5, 2021 6:23 pm IST

టాలీవుడ్ లో పలు చిత్రాలతో తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ ఓటిటి ల పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం పై క్లారిటీ వస్తోంది. ఎంటర్ టైన్మెంట్ పరిశ్రమ లో ప్రస్తుతం ఓటిటి అనేది చాలా పెద్ద విషయం అని చెప్పుకొచ్చింది. అయితే చాలా పెద్ద ప్రాజెక్టులు ఈ ఓటిటి బాటను పట్టినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు నిర్మాతలు కూడా ఓటిటి ల మార్పును గమనిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రెండు ఓటిటి ల గురించి చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటి పై ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మరి రకుల్ వీటి పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :