ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో తన రీచ్ ని నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సెన్సేషనల్ ప్రాజెక్ట్ “వారణాసి” లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత జక్కన్న ప్రాజెక్ట్ ఎవరితో ఏ హీరోతో అనేది అందరిలో సస్పెన్స్ గా మారింది. అయితే రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ తన RRR, మగధీర హీరో రామ్ చరణ్ తో ఉంటుంది అని ఇప్పుడు టాక్ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ టాక్ లో ప్రస్తుతం ఎలాంటి నిజం లేదనే వినిపిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి ఫోకస్ అంతా వారణాసి మాత్రమే ఉంది కాని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. అయితే RRR 2 ని మాత్రం ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు కానీ దీనిని స్టార్ట్ చెయ్యాలంటే ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కావాలి. సో కేవలం రామ్ చరణ్ తోనే ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతానికి కేవలం గాలి వార్తే అని చెప్పాలి.


