సాహో మూవీ కొరకు చరణ్ అక్కడకు వెళ్లాడా?

Published on Aug 29, 2019 1:19 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు సూళ్లూరు పేట వెళ్లినట్టు తెలుస్తుంది. ఆయన అక్కడ గల ప్రముఖ థియేటర్ వి ఎపిక్ నందు సాహో మూవీ ప్రీమియర్ వీక్షించనున్నారని తెలుస్తుంది. హైదరాబాద్ నుండి నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటకు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన రామ్ చరణ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

సూళ్ళూరి పేటలోని వి ఎపిక్ ధియేటర్ స్క్రీన్ ప్రంపంచంలోనే పెద్ద స్క్రీన్ లలో ఒకటి. సౌత్ ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ కలిగిన థియేటర్ గా పేరుగాంచిన వి ఎపిక్ ఆధునిక సాంకేతికతతో రూపొందింది. అందుకే రామ్ చరణ్ ఇక్కడ మూవీ చుడనున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన వార్త. రామ్ చరణ్ సాహో మూవీ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంచరించుకుంది.

సంబంధిత సమాచారం :