నెట్ ఫ్లిక్స్ తో వెబ్ సిరీస్ ప్లాన్ చేసిన రానా?

Published on Jul 3, 2021 12:15 am IST


తెలుగు సినీ పరిశ్రమ లో ఎంతోమంది నటులు నిర్మాతలు గా మారారు. అందులో కొంతమంది విజయం కూడా సాధించారు. అయితే ఇప్పుడు దగ్గుబాటి రానా నెట్ ఫ్లిక్స్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే తన వద్దకు వచ్చిన ఒక కథ తో ఈ వెబ్ సిరీస్ ను నిర్మించే ఆలోచనలో ఉన్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ ను సంప్రదించిన రానా ఈ కథ పై చాలా నమ్మకం కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే నెట్ ఫ్లిక్స్ రానా కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరగా వెలువడే అవకాశం ఉంది. అంతేకాక ఇందుకు సంబంధించిన నటీనటులు, దర్శకుడు ఎవరనేది త్వరలోనే తెలియనున్నాయి. అయితే రానా హీరోగా నటిస్తున్న విరాట పర్వం చిత్రం విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ కారణం గా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :