రవితేజ దర్శకుడికి కరోనా పాజిటివ్.?

Published on Apr 20, 2021 9:00 am IST

మన తెలుగులో ఈ ఏడాది తన మాస్ చిత్రం “క్రాక్” తోనే సాలిడ్ హిట్ ను ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ అదే హిట్ ఇచ్చిన కిక్ తో తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా జెట్ స్పీడ్ తో స్టార్ట్ చేసి పూర్తి చెయ్యడం స్టార్ట్ చేశారు.కరోనా సమయంలో డేర్ చేసిన వచ్చిన రవితేజ స్టార్ట్ చేసిన మరో చిత్రమే “ఖిలాడి”.

తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మరియు భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా మారనంత వరకు చాలా మేర షూట్ ను పూర్తి చేసేసారు.

కానీ ఊహించని విధంగా టాలీవుడ్ లో అనేకమంది కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు రమేష్ వర్మ కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజం అయితే అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం..

సంబంధిత సమాచారం :