‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?

‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?

Published on Aug 4, 2026 10:02 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. మంచి పాజిటివ్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న అభిమానులుకి వరుస అప్డేట్స్ లో భాగంగా వచ్చిన రెండో సాంగ్ ఆకట్టుకుంది.

ఇక నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ లో సాలిడ్ ట్రైలర్ కట్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఇరుముడి ట్రైలర్ ఈ ఆగస్ట్ 16 లేదా 17న రానున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చేయనున్నట్టుగా టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ప్రియా భవాని శంకర్ రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా ఆగస్ట్ 21న విడుదల కాబోతుంది.

తాజా వార్తలు