అవైటెడ్ “లవ్ స్టోరీ” రిలీజ్ టైం ఫిక్స్ అయ్యిందా.?

Published on Jun 16, 2021 3:00 pm IST

గత కరోనా సెకండ్ వేవ్ మూలాన మన టాలీవుడ్ నుంచి విడుదలకు ఆగిపోయిన పలు ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో అక్కినేని యువ హీరో నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం అని అంతా అనుకున్న నేపథ్యంలో కరోనా రెండో వేవ్ మూలాన ఈ చిత్రం విడుదల కూడా తాత్కాలికంగా వాయిదా పడాల్సి వచ్చింది.

అయితే ఆ తర్వాత మే నాటికి అలా విడుదల చేస్తామని తెలిపారు. కానీ అది కూడా అవ్వలేదు. మరి ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ తగ్గుతున్న నేపథ్యంలో మేకర్స్ విడుదల తేదికి సమయం ఫిక్స్ చేసుకున్నట్టు టాక్ నడుస్తుంది. ఆ టాక్ ప్రకారం వచ్చే ఆగష్టు రిలీజ్ కానీ కర్ఫ్యూ ఎత్తివేసిన రెండు వారాలకి అలా చెయ్యాలని అనుకుంటున్నారట. మరి అధికారిక క్లారిటీ లేదు కానీ ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం మాత్రం చాలా మందే ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :