లేటెస్ట్..”RRR” ముందే మొదలు కానుందా.?

Published on Jun 20, 2021 7:00 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారత దేశ వ్యాప్తంగా ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇంకా కొన్ని రోజులు షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక దానిని కూడా రాజమౌళి వచ్చే జూలై నుంచి స్టార్ట్ చేయనున్నారని ఇటీవలే కూడా తెలిసింది.

అయితే ఇప్పుడు మరో టాక్ లేటెస్ట్ గా చక్కర్లు కొడుతుంది. ఈ భారీ చిత్రం షూట్ రేపటి వారం నుంచే స్టార్ట్ కానుందట. అయితే ఇంకా చరణ్ మరియు తారక్ లు జాయిన్ అవుతారా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ ఆలియా మాత్రం జూలై మొదటి వారం నుంచి జాయిన్ కానుంది అని కన్ఫర్మ్ అయ్యింది. అలాగే మరోపక్క ఈ బ్యాలన్స్ షూట్ ను ఎప్పుడు ఫినిష్ చేసి విడుదల చేస్తారా అన్నది కూడా మరింత ఆసక్తికరంగా మారింది. మరి వాటిన్నిటికీ కాలం ఎప్పుడు సమాధానం చెబుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :