సామ్ మరో గ్రాండ్ ఓటిటి సిరీస్ కు సిద్ధంగా ఉందా.?

Published on Jun 12, 2021 7:02 pm IST

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేనికి తన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2” తో మొత్తం దేశ వ్యాప్తంగా తన పేరుని మరింత వినిపించేలా చేసింది. తన అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసిన సామ్ మరో భారీ సిరీస్ తో రాబోతుంది అని గత కొన్ని రోజులు నుంచి టాక్ ఉంది.

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్న బహు భాషా సిరీస్ లో సామ్ నటించడం ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందని బజ్ వినిపిస్తుంది. అయితే ఇప్పటికే సామ్ ను సంప్రదించగా ఆమె కూడా ఈ సిరీస్ లో నటించేందుకు సిద్ధంగా ఉందని తెలిసింది. అలాగే ఈ సిరీస్ హిందీ, తెలుగు సహా తమిళ్ భాషల్లో ప్లాన్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సామ్ నుంచి రాబోయే ఈ సిరీస్ పై ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే సామ్ తన సినిమాల్లో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం :