ప్రభాస్ సినిమాలో ఈ బాలీవుడ్ నటుడు ఇంకా ఉన్నాడా.?

Published on Jun 25, 2021 7:05 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టేకప్ చేసిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో డైరెక్ట్ బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. “తనాజీ” ఫేమ్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ విజువల్ వండర్ పై అనేక అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో క్యాస్టింగ్ పరంగా కొంతమంది స్టార్ నటుల పేర్లు ఆల్రెడీ ఫిక్స్ అయ్యాయి. అయితే ఆల్రెడీ ఫిక్స్ అయ్యినవారు కాకుండా ఆ మధ్య మంచి హల్ చేసిన పేరు సిద్దార్థ్ శుక్ల.

అక్కడి బిగ్ బాస్ షో తో అపారమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడన్న టాక్ బాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి హై తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత మాత్రం తనకి ఎలాంటి కాల్ ఆదిపురుష్ నుంచి రాలేదని ఓ ముగింపు ఈ నటుడు ఓ ఇంటర్వ్యూ ద్వారా ఇచ్చేసాడు.

అయితే ఇది అక్కడితో అయ్యిపోలేనట్టు అనిపిస్తుంది. ఇంకా బాలీవుడ్ వర్గాల నుంచి ఈ నటుడు ఉన్నాడనే సూచనలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆదిపురుష్ ప్రస్తావనలో సిద్దార్థ్ పేరు కూడా వస్తుంది. మరి ఈ నటుడు ఉన్నాడో లేదో అన్న దానిపై అధికారిక ప్రకటన వస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.

సంబంధిత సమాచారం :