టాక్..మరోసారి “మాస్టర్” కాంబో..?

Published on Oct 12, 2021 10:14 pm IST


కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన ఇళయ థలపతి విజయ్ హీరోగా నటించిన లాస్ట్ సినిమా “మాస్టర్”. అన్నీ కుదిరి ఈ సినిమాపై భారీ హైప్ వచ్చింది. అంతే కాకుండా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సాలిడ్ విలన్ రోల్ లో నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకోవడమే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాతో దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ పేరు కూడా తెలుగు ఆడియెన్స్ లో బాగా నానింది.

దానికి ముందు “ఖైదీ” లాంటి బ్లాక్ బస్టర్ కూడా తనదే అని తెలియడంతో లోకేష్ సినిమాలు పట్ల తెలుగు ఆడియెన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు తాజా టాక్ ప్రకారం ఈ మాస్టర్ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. బహుశా ఇప్పుడు విజయ్ చేస్తున్న “బీస్ట్”, ఆ తర్వాత వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ అనంతరం ఇది ఉండొచ్చేమో అని సినీ వర్గాల్లో టాక్. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :