ఆ క్రేజీ హీరోయిన్ ఫుల్ డిమాండ్ చేస్తోందట

Published on Mar 31, 2020 8:04 am IST

సినిమాల నిర్మాణం అంటేనే కోట్లతో పని… సినిమా హిట్ అయితే చాలు.. ఆ సినిమాకి పని చేసిన మెయిన్ పిల్లర్స్ అందరూ తరువాత సినిమాకి కోట్లు అడుగుతారు. ముఖ్యంగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్. కాస్త యాక్టింగ్ స్కిల్ అండ్ కొంచెం ఫాలోయింగ్ పెరిగితే చాలు.. ఇక ఆ హీరోయిన్ రెమ్యూనిరేషన్ అమాంతం పెరిగిపోతుంది. దానికితోడు వరుస హిట్స్ వస్తే మాత్రం ఆ హీరోయిన్ ఆర్డర్స్ కి అడ్డుహదుపు ఉండదు. ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ కూడా ఫుల్ డిమాండ్ చేస్తోందట. ఏ మాత్రం తన కండిషన్స్ కు అడ్డు చెబితే ఇక ఆ సినిమా చేయను అని చెప్పేస్తోందట.

రీసెంట్ గా సూపర్ స్టార్ తో సూపర్ హిట్ అందుకోవడంతో పాటు మరో యంగ్ హీరోతో కూడా సూపర్ హిట్ అందుకుంది. దాంతో అమ్మడు ఎవ్వర్నీ లెక్క చేయట్లేదట. పైగా స్టార్స్ పక్కన తప్ప యంగ్ హీరోలతో ఇక సినిమాలు చేయనని చెప్పేస్తోందట. స్టార్ డమ్ లేని హీరోల ప్రాజెక్ట్ లు తన దగ్గరకు తీసుకురావద్దని తన మేనేజర్ కు చెప్పేసిందట. మొత్తానికి కోట్ల రూపాయిల భారీ మొత్తాన్ని అడుగుతూ.. భారీ ఆఫర్స్ నే అందుకోవాలని ఆ క్రేజీ బ్యూటీ ప్లాన్. మరి ఆ హీరోయిన్ డిమాండ్లను ప్రొడ్యూసర్స్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More