బిగ్ బాస్ లో డ్రామా నిజం కదా ?

Published on Nov 22, 2021 10:26 am IST

బిగ్ బాస్ రియాలిటీ షో పై చాలా వివాదాలు వచ్చాయి. ముఖ్యంగా సంప్రదాయవాదులకు ఈ షో అస్సలు నచ్చదు. చాలా కాలంగా వాళ్ళు ఈ షోని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఒకే ఇంటిలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండటం అనేది మన సంస్కృతికి వ్యతిరేకం అని వాళ్ళ అభిప్రాయం. అయితే మరోవైపు ఈ షోలో జరిగే డ్రామా అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని ప్రస్తుతం ఓ ప్రచారం బాగా వినిపిస్తోంది.

ముఖ్యంగా కంటెస్టెంట్స్ గేమ్స్, ఎమోషన్స్, అలాగే వారి మధ్య జరిగే గొడవలు, ఆ గొడవల కారణంగా వచ్చే కన్నీళ్లు కూడా అంతా ప్లాన్ ప్రకారం జరుగుతాయట. అన్నిటికీ మించి ఎలిమినేషన్స్ కూడా, పద్ధతిగా నిర్వాహకులు ప్లాన్ ప్రకారం అమలు చేస్తారట. జెస్సీ ఎలిమినేషన్ లో ఇది నిజం అయింది అంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు అంటూ జెస్సీని హౌస్ నుండి బయటకు పంపారు.

అయితే తీరా బయటికి వచ్చాక జెస్సీ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. పైగా విందులు, వినోదాలలో కూడా జెస్సీ భేషుగ్గా పాల్గొంటున్నాడు. బిగ్ బాస్ చెప్పినట్లు, అంత సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్ అతనిలో కనిపించడం లేదు. అందుకే బిగ్ బాస్ లో డ్రామా అంతా నిజం కాదనే వాదన బలంగా వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం :

More