హీరో రాజశేఖర్‌ కూతురు ఆ స్టార్ హీరో కొడుకుతో నిజమేనా ?

Published on Jul 19, 2018 4:51 pm IST


రాజశేఖర్, జీవిత పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్‌ ‘2 స్టేట్స్‌’చిత్రంతో హీరోయిన్ గా పరిచయమవబోతున్న విషయం తెలిసిందే. కాగా ఆమె ఒక్క తెలుగులోనే కాకుండా పక్క భాషలైన తమిళ, మలయాళ చిత్రపరిశ్రమల్లోనూ నటించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే తమిళంలో విష్ణువిశాల్‌ హీరోగా రూపొందుతున్న చిత్రంలో శివాని హీరోయిన్ గా నటించబోతున్నారు.

అయితే మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ కు జోడిగా శివాని రాజశేఖర్‌ నటిస్తోందని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ప్రణవ్‌ మోహన్‌లాల్‌ సరసన శివాని రాజశేఖర్‌ నటిస్తోందని తెలుస్తోంది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మూడు భాషల్లోనూ నటించడానికి శివాని రెడీ అవ్వడం నిజంగా విశేషమే. తన తల్లిదండ్రుల లాగే శివాని రాజశేఖర్‌ కూడా సక్సెస్ అవుతుందని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

X
More