‘సైరా’లో ఇంట్రస్టింగ్ రోల్ అదేనా ?

‘సైరా’లో ఇంట్రస్టింగ్ రోల్ అదేనా ?

Published on May 19, 2019 9:16 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సినిమా మొత్తంలో మెగాస్టార్ పాత్ర తరువాత మరో పాత్రకి కూడా ప్రత్యేకమైన గుర్తింపు వస్తోందట. ఆ పాత్రలోనే తమిళ్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. అయితే విజయ్ సేతుపతి పాత్రకు కాస్త నెగిటివ్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే విజయ్ సేతుపతి గెటప్ ను రివీల్ చేసింది చిత్రబృందం. ఆ గెటప్ పోస్టర్ లో సాంప్రదాయ వస్త్రధారణలో కాస్త ఆ నాటి గూఢచారి ఛాయలు ఉన్న లుక్ లో విజయ్ సేతుపతి నెటిజన్లను బాగానే ఆకట్టుకున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు