బన్నీ బర్త్ డే సర్ప్రైజ్ గిఫ్ట్ అదేనా..?

Published on Apr 5, 2020 9:04 am IST

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కొద్ది రోజులలో పెద్ద పండుగ ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. 1983లో పుట్టిన బన్నీ ఈఏడాది 37వ జన్మదినం జరుపుకోనున్నారు. దీనితో ఆయన ఫ్యాన్ ఆర్మీ భారీగా సెలెబ్రేట్ చేయాలని భావించినా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆ పరిస్థితి లేదు. ఇక బన్నీ సైతం సింపుల్ గా తన బర్త్ డే కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని భావిస్తున్నారట. అలాగే ఫ్యాన్స్ ని కూడా ఎటువంటి కార్యక్రమాలు జరపకూడదని ఆదేశించే అవకాశం కలదు. సెలెబ్రేషన్స్ సంగతి ఎలా ఉన్నా, ఫ్యాన్స్ మాత్రం ఆయన కొత్త మూవీ అప్డేట్ కోరుకుంటున్నారు.

ఐతే అసలు ఇంత వరకు బన్నీ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనలేదు. అలాగే ఈ మూవీ ఈ ఏడాది వచ్చే సూచనలు లేవు. ఈ తరుణంలో బన్నీ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ రావడం అనేది అసంభవం. కాబట్టి బన్నీ పుట్టినరోజు నాడు డైరెక్టర్ సుకుమార్ టైటిల్ పోస్టర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఓన్లీ బర్త్ డే విషెస్ పోస్టర్ తో సరిపెట్టినా ఆశ్చర్యం లేదు. మరి చూడాలి బన్నీ ఫ్యాన్స్ కోసం సుకుమార్ ఏమి సిద్ధం చేస్తున్నాడో. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More