పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప కి సక్సెసర్ గా ఇప్పుడు దానికి మించిన గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి దీనిని అయితే ఊహలకు మించిన మాస్ ఎలిమెంట్స్ తో దర్శకుడు సుకుమార్ విజన్ తో తెరకెక్కిస్తుండగా వస్తున్నా ఒకో అప్డేట్ తో అయితే సినిమా మరింత స్థాయిలోకి వెళ్తుంది.
ఇక ఇదిలా ఉండగా క్యాస్టింగ్ పరంగా కూడా ఈ చిత్రం మరింత గ్రాండ్ గా మారుతుండగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం తమిళ్ స్టార్ హీరో కార్తీ పేరు పరిశీలనలోకి వచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి ఇంకా కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని టాక్. మరి ఇందులో ఎంతమేర నిజం ఉందో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
