డైరెక్ట్ ఓటిటిలో రానున్న ఆ స్టార్ హీరో సినిమా ఇదేనా.?

Published on Aug 12, 2020 7:16 pm IST


ఈ ఏడాది అనుకోకుండా వచ్చిన అతిధి మూలాన విధించిన లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమకు కూడా ఎంతటి నష్టం వాటిల్లిందో అందరికీ తెలిసిందే. పైపెచ్చు ఇదే సమయంలో అప్పటికే షూటింగ్ లు పూర్తి చేసుకున్న పలు చిత్రాలు థియేటర్స్ లేక నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల కావడం మొదలయ్యాయి.

అలా ఇప్పటికే చాలానే సినిమా ఓటిటి ప్రపంచంలో విడుదల కాగా మన టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన పలు చిత్రాలకు కూడా చాలానే స్ట్రీమింగ్ సంస్థలు భారీ ఆఫర్లను ఇస్తూ ముందుకు వచ్చాయి. కానీ చాలా మంది నిర్మాతలు అందుకు నో అనే సమాధానాన్నే ఇచ్చారు.

అయితే వాటిలో నో చెప్పిన స్టార్ హీరోల సినిమాలో నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబులు నటించిన చిత్రం “వి” కూడా ఒకటి.మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆ సమయంలో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు భారీ ఆఫర్ ను ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. కానీ నిర్మాత దిల్ రాజు ఆ ఆఫర్ ను తిరస్కరించారు.

కానీ ఇప్పుడు మళ్ళీ ఇవ్వగా అందుకు మేకర్స్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్ర వచ్చే సెప్టెంబర్ మొదటి వారంలోనే డిజిటల్ ప్రీమియర్ గా అందుబాటిలోకి తేనున్నట్టు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న టాక్. మరి దీనికి సంబంధించి మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More