బన్నీకి లోకేష్ చెప్పిన కథ ఇదే.. హాలీవుడ్ కామిక్ ఆధారంగా?

బన్నీకి లోకేష్ చెప్పిన కథ ఇదే.. హాలీవుడ్ కామిక్ ఆధారంగా?

Published on Dec 3, 2025 11:02 AM IST

 లోకేష్

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ వాంటెడ్ గా మారిన స్టార్ హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు దర్శకుడు అట్లీతో సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ లైనప్ మరింత ప్యాకెడ్ గా మారింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ మరో టాప్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ కి కూడా ఒక కథ చెప్పినట్టు రీసెంట్ గానే స్ట్రాంగ్ రూమర్స్ వినిపించాయి.

కానీ ఇప్పుడు దీనిపై మరిన్ని డీటెయిల్స్ తెలుస్తున్నాయి. అల్లు అర్జున్ కి లోకేష్ కనగరాజ్ హాలీవుడ్ ఫేమస్ కామిక్స్ డీసీ కామిక్స్ లో 1962లో ప్రచురితం అయ్యిన ‘ది స్టీల్ క్లా’ అనే కామిక్ ఆధారంగా కథ చెప్పినట్టు తెలుస్తుంది. ఒక మనిషి ఓ యాక్సిడెంట్ మూలాన తన ఎడమ చేతిని కోల్పోయినప్పుడు తనకి ఓ ఇనుప చేతిని అమరుస్తారు.

ఆ తర్వాత అతనికి ఓ ఊహించని ఘటనతో కొన్ని పవర్స్ రావడం మూలాన మాయమయ్యే శక్తి వస్తుంది అని తన చేయి మాత్రం మాయం కాదు. ఇలాంటి ఒక కథని అల్లు అర్జున్ ని లోకేష్ నరేట్ చేసాడట. మరి ఈ కామిక్ తాలూకా హక్కులు తీసుకున్నారా లేదా? అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉన్నాయి. వీటి అన్నింటిపై మాత్రం ఒక తుది క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు