పవన్ సినిమాకు ఈ టైటిల్ రిజిస్టర్ అయ్యిందా.?

Published on Feb 3, 2021 8:00 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్న పీరియాడిక్ చిత్రం కూడా ఒకటి. మరి అలాగే ఈ భారీ చిత్రానికి సంబంధించి కూడా పవన్ అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి గాను గత కొన్నాళ్ల నుంచి పలు రకాల టైటిల్స్ గట్టిగా వినిపించాయి. “విరూపాక్ష”, “బందిపోటు”, “హరి హర వీర మల్లు” ఇలా చాలానే టైటిల్స్ ఆ మధ్యన సినీ వర్గాల్లో వైరల్ అయ్యాయి.

కానీ ఇప్పుడు మరో టైటిల్ రిజిస్టర్ చెయ్యించించేసినట్టుగా టాక్ గట్టిగా వైరల్ అవుతుంది.. మరి ఈ చిత్రానికి మేకర్స్ “హర హర మహాదేవ్” అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చెయ్యించారని సమాచారం. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :