‘విశ్వంభర’ పై క్లారిటీ అప్పుడేనా!

‘విశ్వంభర’ పై క్లారిటీ అప్పుడేనా!

Published on Jul 29, 2026 4:00 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భారీ చిత్రమే ‘విశ్వంభర’. ఈ ఏడాది వచ్చిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు కంటే ముందే రావాల్సిన ఈ భారీ ఫాంటసీ యాక్షన్ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు.

అయితే సినీ వర్గాల్లో ఈ చిత్రం ఈ అక్టోబర్ 16న గ్రాండ్ గా విడుదలకి రానుంది అనే టాక్ కన్ఫర్మ్ అయ్యింది. కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం మేకర్స్ నుంచి ఇప్పటికీ రాకపోవడంతో అభిమానులు కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ఈ అంతటికీ మెగాస్టార్ పుట్టినరోజే సమాధానం కానుంది అని తెలుస్తుంది.

ప్రస్తుతానికి సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ పనులే జరుగుతూ వస్తుండగా అన్నీ కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ డేట్ ని చిరంజీవి జన్మదినం కానుకగా ఆగష్టు 22న అనౌన్స్ చేయనున్నట్టుగా ఇపుడు కొత్త బజ్. సో దీనిపై ఇంకొన్ని రోజుల్లో ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు