‘లెనిన్’.. తక్కువ రిస్క్ కోసమే ఇలా?

‘లెనిన్’.. తక్కువ రిస్క్ కోసమే ఇలా?

Published on Jul 9, 2026 8:11 AM IST

Lenin

అక్కినేని అఖిల్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ‘లెనిన్’. డీసెంట్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా రేపు తెల్లవారుజాము షోస్ తో రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఓ రోజు ముందు రాత్రే ప్రీమియర్స్ ఆశించారు. తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ ఉంటాయని టాక్ కూడా వచ్చింది.

థమన్ కూడా రిలీజ్ ప్రెస్ మీట్ లో ప్రీమియర్స్ కోసం చెప్పాడు. కానీ మేకర్స్ రిలీజ్ రోజు తెల్లవారు 5 గంటల షోస్ తో సినిమా మొదలవుతుంది అని కన్ఫర్మ్ చేశారు. సో దీనితోప్ రిస్క్ తక్కువ మోతాదులో తీసుకుందామని ఫిక్స్ అయ్యారు అనుకోవచ్చు. ముందు రోజు రాత్రి నుంచే అయితే ఏమాత్రం టాక్ చిన్నది తేడా వచ్చినా డే 1 కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే ఉదయమే ఏర్పాటు చేసుకోవడం మంచి మూవ్ అనుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి నాగవంశీ, నాగార్జున నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు