చరణ్‌ – సుకుమార్ సినిమాకు హీరోయిన్ దొరికేసింది!

చరణ్‌ – సుకుమార్ సినిమాకు హీరోయిన్ దొరికేసింది!

Published on Nov 2, 2016 4:00 PM IST

raasi-kanna
విలక్షణ దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఓ స్టైలిష్ రివెంజ్ డ్రామాతో హిట్ కొట్టిన సుకుమార్, ఈసారి రామ్ చరణ్‌తో విలేజ్ డ్రామాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశిఖన్నాను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది.

ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ రేసులోకి వచ్చేసి దూసుకుపోతోన్న రాశిఖన్నా తన సినిమాలోని విలేజ్ రోల్‌కి సరిపోతుందని సుకుమార్ ఆమెను ఎంపిక చేశారట. కాగా ఇదే విషయమై టీమ్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా సుకుమార్ స్టైల్లో ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసేలా ఉంటుందట.

తాజా వార్తలు