“అఖండ” నుంచి మొత్తం మూడా..?

Published on Jun 6, 2021 8:45 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. బాలయ్య మరియు దర్శకుడు బోయపాటి శ్రీనులా కాంబో నుంచి వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటికే సాలిడ్ అప్డేట్స్ ను మేకర్స్ టైం టు టైం వదలాగా మరి రానున్న బాలయ్య బాబు బర్త్ డే కి మరిన్ని అప్డేట్స్ ఆశిస్తున్నారు.

అయితే ఆరోజున ఏ అప్డేట్ కన్ఫర్మ్ అన్నది ఇంకా తెలియరాలేదు కానీ బజ్ మాత్రం అలా కొనసాగుతుంది. మొదటగా ఫస్ట్ సింగిల్ సహా టీజర్ కూడా మేకర్స్ వదులుతారని టాక్ రాగా దీనితో పాటుగా స్పెషల్ పోస్టర్ కూడా అఖండ నుంచి వస్తుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజం అయితే మాత్రం ట్రిపుల్ ట్రీట్ నే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :