సీనియర్ హీరోయిన్ పెళ్ళి పై మళ్ళీ రూమర్ !

Published on Jul 5, 2021 10:31 pm IST

సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లికి సంబంధించిన వార్తలు గత కొన్ని సంవత్సరాలుగా చాల రకాలుగా వస్తున్నాయి తప్పితే.. ఆ వార్తల్లో ఇంతవరకు ఒకటి కూడా నిజం కాలేదు. అయితే, తాజాగా త్రిష పెళ్లి చేసుకోబోతుందని మళ్ళీ కొత్త రూమర్ మొదలైంది. తమిళ మీడియా వర్గాల కథనాల ప్రకారం త్రిష ఫ్యామిలీ గత కొంత కాలంగా సీరియస్ గా ఆమె కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఈ క్రమంలో ఒక ఐటీ ఎంప్లాయ్ తో త్రిష పెళ్ళికి సిద్ధం అయిందని పుకారు వినిపిస్తోంది.

మరి ఈ వార్తలో ఎంత నిజం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే. నిజానికి కొన్నాళ్ల క్రితమే పెళ్లి చేసుకునేందుకు త్రిష రెడీ అయింది. వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ, ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన త్రిష‌ చేతిలో ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవి లేవు.

సంబంధిత సమాచారం :