త్రివిక్రమ్ మరో బడా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా.?

Published on May 22, 2021 3:05 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. మరి ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో హ్యాట్రిక్ సినిమా చెయ్యనున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో నడుస్తున్న తరుణంలో మరి ఇంట్రెస్టింగ్ టాక్ బయటికి వచ్చింది. ప్రస్తుతం మహేష్ తో సినిమా అనంతరం మరో భారీ ప్రాజెక్ట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.

ఆది కూడా మెగా హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో అట. అలాగే ఆల్రెడీ స్క్రిప్ట్ ని కూడా త్రివిక్రమ్ రెడీగా ఉంచినట్టు తెలుస్తుంది. ఈ కాంబో కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మరి ఇది మొదలు కడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి. చరణ్ శంకర్ తో సినిమా తర్వాత ఏ దర్శకుడితో చేస్తాడో అన్నది ఇంకా క్లారిటీ లేదు. మరి ఆ రేస్ లోకి ఏమన్నా ఈ చిత్రం వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :