“వకీల్ సాబ్” జాతర మళ్ళీ స్టార్ట్ కానుందా.?

Published on Jun 14, 2021 4:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా దత్సకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏప్రిల్ లో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఆ కొద్ది లోనే మళ్ళీ కరోనా ప్రభావం పెరగడంతో “వకీల్ సాబ్” చిత్రం రెండు వారాలు మాత్రమే థియేటర్స్ లో నిలవగిలిగింది.

ఇక ఇదిలా ఉండగా ఆ కొంతలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు కూడా వచ్చేసింది. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఈ చిత్రం మళ్ళీ థియేటర్స్ లో విడుదల కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని 50 శాతం సీటింగ్ తో మళ్ళీ ఒక 300 థియేటర్స్ లో విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారట.

అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ లేదు కానీ ఒకవేళ నిజం అయితే మంచి మూవ్ అనే చెప్పాలి. మరి టాక్ ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అనన్య నాగళ్ళ, అంజలి మరియు నివేతా థామస్ లు కీలక పాత్రల్లో నటించారు. అలాగే థమన్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం :