“వకీల్ సాబ్”..క్లారిటీ లేకుండానే ముగిసేలా ఉంది.!

Published on Apr 21, 2021 7:30 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ అవైటెడ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. కరోనా ఉదృతి పెరుగుతున్నప్పటికీ పవన్ సినిమా భారీ ఓపెనింగ్స్ తో మంచి టాక్ ను కూడా రాబట్టుకుంది. అయితే పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా సాలిడ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం పై మాత్రం ఓ క్లారిటీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఎంత వసూలు చేసింది అన్న దానిపై రెండు థియరీలు వినిపిస్తున్నాయి.

ఆల్రెడీ ఈ సినిమా 100 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసేసింది అని అలాగే ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి. దీనితో అసలు వకీల్ సాబ్ వసూళ్లపై ఎవరికీ ఒక సరైన క్లారిటీ లేకుండా పోయింది. సినీ వర్గాల్లో అయితే వంద కోట్లు షేర్ వచ్చేసింది అని టాక్ వినపడుతుంది..

కానీ రియాలిటీలో మాత్రం ఈ చిత్రం అంత రాలేదని వినిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కర్ఫ్యూలు లాక్ డౌన్ లు మొదలవుతున్న నేపథ్యంలో వసూళ్లకు మరింత దెబ్బ పడింది. అటు మేకర్స్ నుంచి కూడా వసూళ్లపై ఎలాంటి ఊసు లేదు. దీనితో వకీల్ సాబ్ వసూళ్లు మాత్రం మిస్టరీగా క్లారిటీ లేకుండానే ముగిసిపోయేలా ఉన్నాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :