“వకీల్ సాబ్” మరో నటికి కరోనా పాజిటివ్? క్లారిటీ ఇదే!

Published on Apr 8, 2021 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం కరోనా ఉన్నా భారీ ఓపెనింగ్స్ సెట్ చెయ్యడం ఖాయం అనేలా ఉంది. అయితే మళ్ళీ దేశంలో కరోనా పెరుగుతున్న సమయంలోనే ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన టాలెంటెడ్ నటి నివేతా థామస్ కు కరోనా పాజిటివ్ రావడం షాక్ ఇచ్చింది.

దీనితో ఆమె ప్రీ రిలీజ్ వేడుకకు కూడా రాలేదు. దీనితో మిగతా ఇద్దరు కీలక నటులు అంజలి మరియు అనన్య నాగళ్ళలు హాజరు అయ్యారు. అయితే ఇప్పుడు వీరిలో మరో నటి అంజలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని టాక్ బయటకు వచ్చింది. కానీ అసలు విషయానికి వెళ్తే తాను టెస్ట్ చేయించుకుంది కానీ ఎలాంటి పాజిటివ్ రాలేదట. సో అది అవాస్తవం అని తేలింది. మొత్తానికి మాత్రం “వకీల్ సాబ్” రేపు గ్రాండ్ రిలీజ్ కు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :