విజయ్ దేవరకొండ ‘హీరో’ మూవీ ఆగిపోయిందా..?

Published on Feb 20, 2020 10:24 pm IST

చాలా రోజుల క్రితం విజయ్ దేవరకొండ ‘హీరో’ అనే టైటిల్ తో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. దర్శకుడు ఆనంద్ అన్నమలై తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కూడా ఢిల్లీ లో చిత్రీకరించడం జరిగింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ప్రొఫెషనల్ బైక్ రైడర్ గా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఈ నిర్ణయం తీసుకున్నారని, అందుకే ఈ చిత్రంపై ఎటువంటి అప్డేట్స్ రావడం లేదని పుకారు. మరి ఈ వార్తలలో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తుంది.

ఇక విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి జగన్నాధ్ తో చేస్తున్న మూవీ సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More