విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడా..?

Published on May 19, 2022 7:04 am IST

ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “థలపతి 66” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాతోనే విజయ్ తెలుగులో కూడా మొదటి సారి స్ట్రైట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గానే మేకర్స్ ఈ సినిమాలో ప్రధాన తారాగణం అంతటినీ మేకర్స్ రివీల్ చేశారు.

మరి ఇదిలా ఉంటే లేటెస్ట్ గా మరో బజ్ ఈ సినిమాపై వినిపిస్తుంది. ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని రూమర్స్ వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాని కూడా నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :