టాలీవుడ్ స్టార్ కామెడీ హీరో అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘జంప్ జిలానీ’. అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రతి సినిమాలోనూ కమెడియన్స్ కూడా డామినేట్ చేసేలా కామెడీ పండించే అల్లరి నరేష్ నే డామినేట్ చేసే రేంజ్ లో ‘జంప్ జిలానీ’లో నటించానని ఇషా చావ్లా చెబుతోంది.
ఇషా చావ్లా మాట్లాడుతూ ‘అల్లరి నరేష్ తో షూటింగ్ అంటే అదొక పెద్ద హాలిడే స్పాట్. ఆన్ స్క్రీన్ కంటే ఎక్కువగా ఆఫ్ స్క్రీన్ నవ్విస్తారు. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇన్ని సినిమాల్లోనూ నరేష్ మిగిలిన క్యారెక్టర్స్ ని డామినేట్ చేస్తాడు. కానీ ఇందులో మాత్రం నేను నరేష్ ని డామినేట్ చేసానని’ తెలిపింది. అలాగే తనకి నెగటివ్ రోల్స్ చేయాలని ఉండనే కోరికని మీడియాతో పంచుకున్నారు.
ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి అంబికా రాజా నిర్మిస్తున్నాడు. విజయ్ ఎబెంజర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా జూన్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


