గీత గోవిందం హిందీ రీమేక్ లో యువ హీరో ?

Published on Jan 2, 2019 5:14 pm IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ గత ఏడాది విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం సుమారు 100కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనెర్ హిందీ లో రీమేక్ కానుంది. ఇప్పటికే విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ అక్కడ రీమేక్ అవుతుండగా ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్నారు.

ఇక ఈ రీమేక్ లో యువ హీరో ఇషాన్ కట్టర్ నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఇంకా ఈచిత్రానికి దర్శకుడు ఖరారు కాలేదు. ఇక ‘బియాండ్ ది క్లౌడ్స్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ గత ఏడాది ‘దఢక్’ చిత్రం తో మెప్పించాడు. దఢక్ మరాఠి చిత్రం సైరాట్ కు రీమేక్ గా తెరకెక్కింది.

సంబంధిత సమాచారం :

X
More