ఇస్మార్ట్ శంకర్ టైటిల్ ట్రాక్ అదిరిపోతుందట !

ఇస్మార్ట్ శంకర్ టైటిల్ ట్రాక్ అదిరిపోతుందట !

Published on Mar 22, 2019 11:00 PM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ , డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నచిత్రం ఇస్మార్ట్ శంకర్. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రంలోని టైటిల్ ట్రాక్ కు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడట సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాలో ఈ సాంగ్ హైలైట్ కానుందని సమాచారం.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్ , నాబా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో కొత్త లుక్ లో కనిపించనున్నాడు. పూరి జగన్నాథ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నఈచిత్రం మే చివర్లో విడుదలకానుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు వున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు