ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ అప్డేట్ !

ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ అప్డేట్ !

Published on Mar 27, 2019 4:00 AM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ , డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్నచిత్రం ఇస్మార్ట్ శంకర్ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. నిన్నటి తో ఈ చిత్రం యొక్క గోవా షెడ్యూల్ పూర్తివ్వగా తదుపరి షెడ్యూల్ వారణాసి లో జరుగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాంతో సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ కానుంది.

పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్ , నాబా నటేష్ కథానాయికలుగా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నఈచిత్రం మే లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు