ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ అప్డేట్ !

Published on Apr 30, 2019 12:44 pm IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ బ్రేక్ లేకుండా సాగుతుంది. ఈచిత్రం ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా తదుపరి షెడ్యూల్ వారణాసి లో జరుగనుంది. రేపటి నుండి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది. ఇక ఈ చిత్రాన్ని మే లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు మరి ఆలోగా సినిమా రెడీ అవుతుందో లేదోచూడాలి.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , నాబా నటేష్ కథానాయికలుగా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ , ఛార్మి సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :