‘ఇస్మార్ట్ శంకర్’ చాలా స్పీడ్ గా.. !

Published on Mar 1, 2019 3:03 am IST

వారం రోజుల్లో స్క్రిప్ట్ రాసేయడం, నలభై రోజుల్లో సినిమా తీసేయడం పూరి జగన్నాథ్ వర్క్ స్టైల్. కాగా ప్రస్తుతం పూరి ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి ‘ఇస్మాట్ శంకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరూ హీరోయిన్స్ గా నటిస్తోన్నారు.

అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ రెండవ షెడ్యూల్ ను గోవాలో చిత్రీకరించనున్నాడు పూరి. ఈ షెడ్యూల్ తో దాదాపు సినిమా పూర్తి అవుతుందట. త్వరలోనే విడుదల తేదీని కూడా అనౌన్స్ చేస్తారట. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :