‘టైటిల్ సాంగ్’తో ఆకట్టుకుంటున్న ‘ఇస్మార్ట్ శంకర్’ !

Published on Jun 19, 2019 5:14 pm IST

టాలెంటెడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా మణి శర్మ ఈ సినిమాకి అందిస్తోన్న సంగీతం చాల బాగా వస్తోందట. అయితే తాజాగా చిత్రబృందం ‘టైటిల్ సాంగ్’ విడుదల చేసింది. ఈ పాట ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాంగ్ లోని బీట్స్, మాస్ కి బాగా నచ్చుతుంది. మొత్తానికి పూరి తన శైలి ఎలిమెంట్స్‌ తో తిరిగి వచ్చాడు.

మణి శర్మ తన ట్యూన్‌ తో ఆకట్టుకోగా, భాస్కర్ బట్ల తన సాహిత్యంతో ఆకట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ పాట మాస్ హిట్ అవుతుంది. మరి మిగిలిన పాటలు ఎలా ఉంటాయో చూడాలి. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌’. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

X
More