సాంగ్ షూటింగ్ లో ఇస్మార్ట్ శంకర్ !

Published on Apr 3, 2019 3:45 pm IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ , డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈషెడ్యూల్ లో ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.

దిమాక్ ఖరాబ్ అంటూ సాగె ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , నాబా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో రామ్ లుక్ డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో కొత్త లుక్ లో కనిపించనున్నాడు. పూరి జగన్నాథ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నఈచిత్రం మే లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :