ఐటెం సాంగ్స్ చేయడం ఆషామాషీ కాదు – హంసా నందిని

Published on Oct 21, 2013 10:00 am IST

hamsa-nandini

ప్రస్తుతం హంసా నందిని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ కి హాట్ ఫేవరేట్ గా పేరు తెచ్చుకుంది. 2013లో రిలీజ్ అయిన దాదాపు అన్ని బిగ్ బడ్జెట్ సినిమాల్లో హంసా నందిని ఐటెం సాంగ్స్ చేసింది. ఈ విషయంలో హంసా నందిని చాలా హ్యాపీగా ఉంది. కానీ ఓ ప్రముఖ పత్రిక వారు ఐటెం సాంగ్స్ చేయడం ఈజీ నా అని హంసా నందినిని అడిగితే మాత్రం సమాధానం కాస్త డిఫరెంట్ గా చెప్పింది.

హంసా నందిని మాట్లాడుతూ ‘ ప్రతి సారి ఐటెం సాంగ్ అనేది స్పెషల్ గా ఉండాలి. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాలకు ఐటెం సాంగ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా తయారవుతున్నాయి, అలాగే వీటిపై అంచనాలు కూడా బాగా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి సాంగ్ లోనూ డాన్సులు, వేషదారణ, హావభావాలు మార్చుకోవాలి. కానీ ఈ అనుభవాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఒక్క 2013 లోనే వరుసగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్, నాగార్జున లాంటి టాప్ హీరోల సరసన నటించడం ఓ మరిచిపోలేని అనుభవమని’ తెలిపింది.

నాగార్జునతో కలిసి హంసా నందిని ఐటెం సాంగ్ చేసిన ‘భాయ్’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇది కాకుండా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది.

సంబంధిత సమాచారం :