స్టార్ హీరో ఫాం హౌస్‌ పై ఐటి దాడులు !

Published on Apr 16, 2019 6:06 pm IST

కర్ణాటకలో ఒకపక్క ఎన్నికల హడావుడి జరుగుతుండగానే మరో పక్క ఐటి దాడులు కూడా జరుగుతున్నాయి. అయితే రాజకీయ నాయకులతో పాటు స్టార్ హీరోలు కూడా ఈ ఐటి దాడులను ఎదురుక్కోవాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మండ్య లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా సుమలత అంబరీశ్‌ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే.

కాగా సుమలత తరపున ప్రచారం చేస్తున్న స్టార్‌ హీరో దర్శన్‌ ఫాం హౌస్‌ పై ఐటి అధికారులు దాడి జరిపారు. మైసూరు జిల్లాలో ఉన్న ఈ ఫాం హౌస్‌ పై సోమవారం ఉదయం ఐటి అధికారుల బృందం దాడి చేసి సోదాలు జరిపారు. తన ఫాం హౌస్‌ పై ఐటి దాడులు జరుగుతున్నప్పటికీ హీరో దర్శన్‌ మాత్రం సుమలత కోసం తన ప్రచారాన్ని అలాగే కొనసాగించడం విశేషం.

సంబంధిత సమాచారం :